ఇస్లామాబాద్: ఐసీసీ వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఈజీగా విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఇండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఇండియా రేపు బంగ్లాదేశ్‌తో ఆడనున్నది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ నటి(Pakistan Actress) సెహర్ షిన్వారి .. డేరింగ్ ప్రామిస్ చేసింది. ఒకవేళ ఇండియాను ఓడిస్తే, బంగ్లా క్రికెటర్‌తో డేటింగ్ చేయనున్నట్లు ఆమె ప్రకటించింది. తన సోషల్ మీడియా అకౌంట్లో ఆమె ఈ ప్రకట చేసింది. ఒకవేళ ఇండియా ఓడితే, ఢాకా వెళ్లి బంగ్లా బాయ్‌తో ఫిష్ డిన్నర్ చేయనున్నట్లు చెప్పింది.
InshAllah my Bangali Bandu will avenge us in the next match. I will go to dhaka and have a fish dinner date with Bangali boy if their team managed to beat India ✌️❤️ 🇧🇩
— Sehar Shinwari (@SeharShinwari) October 15, 2023