ఇస్లామాబాద్: ఇండియా తన వైమానిక సత్తాను రాఫేల్ యుద్ధ విమానాలతో బలోపేతం చేసుకున్న విషయం తెలిసిందే. అదే రీతిలో దాయాది పాకిస్థాన్ కూడా తన అమ్ములపొదిని పెంచుకుంటోంది. చైనాకు చెందిన జే-10సీ యుద్ధ విమానాలను పాకిస్థాన్ కొనుగోలు చేసింది. పూర్తి స్క్వాడ్రన్తో కూడిన 25 యుద్ధ విమానాలను చైనా వద్ద పాక్ ఖరీదు చేసినట్లు తెలుస్తోంది. పాక్ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఈ విషయాన్ని తెలిపారు. ఎటువంటి వాతావరణంలోనైనా జే-10సీ యుద్ధ విమానాలను పనిచేస్తాయని మంత్రి చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 23 తేదీ జరిగే పాకిస్థాన్ డే సెర్మనీలో ఈ విమానాలను ప్రదర్శించనున్నారు. పాకిస్థాన్, చైనా దేశాలు సంయుక్త సైనిక విన్యాసాల సమయంలో జే-10సీ విమానాలను వాడాయి. ఆ సమయంలో పాక్ నిపుణులను ఈ యుద్ధ విమానాలను పరిశీలించినట్లు తెలుస్తోంది.