Pahalgam Attack | పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటుండడంతో దాయాది దేశం ఆందోళనకు గురవుతున్నది. అయితే, ఆ దేశ నాయకులు మాత్రం భారత్‌పై ప్రేలాపనలు పేలుతూనే ఉన్నారు. తాజాగా పాకిస్తాన్ మంత్రి హనీఫ్ అబ్బాసి అణుదాడి చేస్తామంటూ భారత్‌కు హెచ్చరికలు చేశారు. పాకిస్తాన్ వద్ద భారత్ కోసం 130 అణ్వాయుధాలను సిద్ధం చేసి ఉంచామన్నారు. భారత్ సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దుచేసి నీటి సరఫరాను నిలిపివేస్తే.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్నారు. మన వద్ద ఉన్న సైనిక పరికరాలు, మన వద్ద ఉన్న క్షిపణులు ప్రదర్శన కోసం కాదని.. మన అణ్వాయుధాలను ఎక్కడ మోహరించామో ఎవరికీ తెలియదతెలియదన్నారు.
నేను మళ్లీ చెబుతున్నాను ఈ బాలిస్టిక్ క్షిపణులు అన్నీ భారతదేశాన్ని లక్ష్యంగానే ఉన్నాయన్నారు. వాణిజ్య సంబంధాలు, భారత్ తన చర్యల కఠిన పరిణామాలను గ్రహించడం ప్రారంభించిందని హనీఫ్ అబ్బాసి పేర్కొన్నారు. పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని మూసివేయడంతో రెండు రోజుల్లోనే భారత విమానయాన రంగంలో గందరగోళం నెలకొందని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే, భారత విమానయాన సంస్థలు పది రోజుల్లోనే దివాళా తీస్తాయన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారతదేశం తన భద్రతా వైఫల్యాలను అంగీకరించడానికి బదులుగా పాకిస్తాన్‌ను నిందిస్తోందన్నారు. భారతదేశం నిర్ణయాల తర్వాత పాకిస్తాన్ సైతం అన్ని పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.