బీరట్: లెబనాన్‌లో కొత్త తరహా అటాక్ జరిగింది. హిజ్బుల్లాలు వాడే పేజర్లను టార్గెట్ చేశారు. పేజర్లను హ్యాక్ చేసి పేల్చేశారు(Pagers Explosion). దీంతో లెబనాన్‌లోని అనేక ప్రాంతాల్లో వేల మంది గాయపడ్డారు. ప్యాకెట్లలో ధరించే పేజర్లలో ఉండే.. లిథియం బ్యాటరీలను పేలుళ్ల కోసం వాడారు. పేజర్ పేలుళ్లలో లెబనాన్, సిరియాల్లో సుమారు మూడు వేల మంది గాయపడ్డారు. 8 మంది మృతిచెందారు. అయితే పేజర్ పేలుళ్లకు చెందిన వీడియోలు కొన్ని ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. ఏదో పనిలో నిమగ్నమైన సమయంలో.. పేజర్ యూజర్లు ఒక్కసారిగా అది పేలడంతో కుప్పకూలిపోయారు. సుమారు 1200 మంది హిజ్బుల్లా ఆపరేటివ్స్ ఈ కొత్త తరహా అటాక్‌లో గాయపడ్డారు. పేజర్ల దాడి వెనుక ఇజ్రాయిల్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Over 1,200 Hezbollah operatives injured in alleged Israeli supply-chain attack converting pagers into improvised explosive devices
A series of pager explosions resulted in a mass-casualty event, killing and critically wounding several operatives across Lebanon and Syria.… pic.twitter.com/PKVRaa8swg
— Brother Mikey (@BrotherMikeyX) September 17, 2024
రిమోట్ సిగ్నల్స్ ద్వారా పేజర్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. హిజ్బుల్లా సభ్యుల వద్ద లిథియం బ్యాటరీలతో తయారైన పేజర్లు ఉన్నాయి. అయితే మంగళవారం జరిగిన పేలుళ్ల ఘటనలో.. ఎక్కువ శాతం హిజ్బుల్లా సభ్యులే గాయపడ్డారు. రిమోట్ సిగ్నల్ అందిన తర్వాత పేలుళ్లు జరిగినట్లు హిజ్బుల్లా అధికారులు చెప్పారు. ఈ దాడికి చెందిన సాంకేతిక సమాచారం ఇంకా అందాల్సి ఉన్నది. ఏదో మాల్వేర్ ద్వారా ఈ అటాక్ జరిగినట్లు భావిస్తున్నారు. ఇజ్రాయిల్ మోసాద్ .. ఈ అటాక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
The moment Hezbollah pagers exploded throughout Lebanon pic.twitter.com/CwEQCSwFlh
— Mossad Commentary (@MOSSADil) September 17, 2024