కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో బ్యూటీ సెలూన్లు తమ షాపుల్లో ఉన్న ఆడవాళ్ల బొమ్మలను తీసివేస్తున్నాయి. తాలిబన్లకు భయపడిన షాపు ఓనర్లు.. తమ సెలూన్లలో ఉన్న అమ్మాయిల ఫోటోలను రంగులతో కప్పేస్తున్నారు. ఆఫ్ఘన్ ఆడవారి కోసం షరియత్ చట్టాలను అమలు చేయనున్నట్లు తాలిబన్లు ప్రకటించిన నేపథ్యంలో సెలూన్లు అప్రమత్తమయ్యాయి. ఆడవాళ్లపై కఠిన ఆంక్షలు విధించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగానే సెలూన్ ఓనర్లు తమ షాపుల్లో ఉన్న చిత్రాలను మార్చేస్తున్నారు.
Owners of a number of beauty salons in Kabul are removing pictures of women from their shop windows.#Afghanistan pic.twitter.com/xmaYbT2iTV
— Pajhwok Afghan News (@pajhwok) August 18, 2021