Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చావును ముందే ప్రకటించాడు అక్కడి ప్రతిపక్ష నేత లియో పొనోమరేవ్. పుతిన్ అక్టోబర్ 7 వ తేదీ లోపు చనిపోవడం ఖాయమంటున్నారాయన. అది కూడా ఆయన అత్యంత సన్నిహితుడి చేతిలోనే చావబోతున్నారని జోస్యం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పుతిన్ తన 71 వ పుట్టినరోజును జరుపుకోలేరని లియో పొనోమరేవ్ చెప్తున్నారు. ఈయన మాటలు నమ్మశక్యంగా లేవని పరిశీలకులు కొట్టిపారేస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ చావును పసిగట్టినట్లు అక్కడి ప్రతిపక్ష నేత లియో పొనోమరేవ్ చెప్పారు. వచ్చే అక్టోబర్ 7 వ తేదీ లోపుగా పుతిన్ హత్యకు గురవుతారని పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయన తన 71 వ పుట్టినరోజును జరుపుకోరని కుండబద్దలు కొడుతున్నారు. అదికూడా పుతిన్‌కు అత్యంత సన్నిహితుడి చేతిలోనే ఆయన చనిపోతున్నారని చెప్పారు. ఉక్రెయిన్‌పై విజయాన్ని రష్యా తప్పుగా పేర్కొంటున్నదని, పుతిన్ సైన్యం ఆధీనంలో ఉక్రెయిన్‌కు చెందిన ఏ ఒక్క భాగం కూడా 100 శాతం లేదని లియో అంటున్నారు. దీనికంటే ముందుగా రష్యా అధ్యక్షుడికి క్యాన్సర్, పార్కిన్సన్స్ వంటి తీవ్రమైన వ్యాధులు ఉన్నాయని, అతను ఎప్పుడైనా కోమాలోకి వెళ్లవచ్చని పాశ్చాత్య మీడియా ముఖ్యంగా అమెరికన్ మీడియా చాలాసార్లు పేర్కొన్నది. అయితే, రష్యా ప్రభుత్వం ఈ వాదనలను తిరస్కరిస్తూ వచ్చింది.
పుతిన్‌కు బద్ద వ్యతిరేకిగా లియో పొనోమరేవ్ నిలిచారు. ప్రస్తుతం ఈయన ఉక్రెయిన్‌లో నివసిస్తున్నారు. 2007 నుంచి 2016 వరకు ఎంపీగా ఉన్నారు. ప్రతి వేదికపై పుతిన్ తప్పుడు విధానాలను వ్యతిరేకించిన ఎంపీగా, ప్రతిపక్ష నేతగా లియో గుర్తింపు పొందారు. 2014లో క్రిమియాపై రష్యా దాడి చేసి ఆక్రమించినప్పుడు బహిరంగంగా వ్యతిరేకించిన ఏకైక ఎంపీ పొనోమరేవ్ నిలిచారు.