న్యూయార్క్, డిసెంబర్ 2: అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ ‘ఓమ్నికామ్’ భారీ ఎత్తున ఉద్యోగాల కోత చేపడుతున్నట్టు తెలిసింది. న్యూయార్క్ కేంద్రంగా గల ఈ సంస్థలోని పలు విభాగాల్లో క్రియేటివ్ ఏజెన్సీలను మూసివేస్తూ 4వేలకు పైగా ఉద్యోగాలకు కోత పెట్టబోతున్నది.
అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్‌లో తన ప్రధాన ప్రత్యర్థి ‘ఇంటర్‌పబ్లిక్ గ్రూప్’ను 13.5 బిలియన్ డాలర్లకు ఓమ్నికామ్ కొనుగోలు చేసిన కొద్ది రోజుల్లో ఈ పరిణామం చోటుచేసుకుంది. రెండు సంస్థల విలీనానికి ముందు, ఇంటర్‌పబ్లిక్ గ్రూప్‌లో 51 వేల మంది, ఓమ్నికామ్లో 75 వేల మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్యను 1,05,000కు తగ్గించబోతున్నట్టు తెలిసింది.