
జపాన్‌కు చెందిన ఈ బామ్మ పేరు కానే టనాకా. వయసు 119 ఏండ్లు. జీవించి ఉన్న వ్యక్తుల్లోకెల్లా ఎక్కువ వయసున్న వ్యక్తిగా రెండేండ్ల కిందటనే రికార్డుల్లోకెక్కారు. మరి ఇప్పుడెందుకు ఈ ముచ్చట చెప్పుకొంటున్నామంటే..2వ తేదీన ఆమె కుటుంబ సభ్యులందరితో కలసి తన 119వ పుట్టినరోజు జరుపుకొన్నది.