ఒబామా నాయినమ్మ, సంఘసేవకురాలు మమా సారా కన్నుమూత

నైరోబి: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నాయినమ్మ, అనాథల జీవితాల్లో అక్షర జ్యోతులు వెలిగించిన మామా సారా (99) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కెన్యాలోని కిసుము నగరంలోగల జరమోగి ఒడింగా ఒడింగా టీచింగ్ అండ్ రిఫరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె మరణించారు.
ఒబామా తండ్రికి పినతల్లి అయిన మమా సారా సంఘ సేవకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అనాథలు, బాలికలకు విద్యను అందించడానికి ఆమె ఎంతో కృషి చేశారు. ఒబామా తండ్రి సీనియర్ ఒబామాను స్కూల్‌కు తీసుకెళ్లడానికి ఆమె రోజూ తొమ్మిది కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కేవారట. తమ స్వగ్రామం కోగెలో నుంచి ఎన్జీయా నగరానికి ఆయనను తీసుకెళ్లి చదువు చెప్పించేవారట.

బరాక్ ఒబామా తను రాసిన ‘డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్’ పుస్తకంలో మమా సారా గురించి ప్రస్తావించారు. 1988లో తొలిసారి ఆమెను కలుసుకన్నట్టు రాశారు. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా తొలిసారి ప్రమాణం స్వీకారం చేసినప్పుడు మమా సారా హాజరయ్యారు. ఆ తర్వాత 2014లో ఒబామా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన సమయంలో కూడా మమా సారా కార్యక్రమానికి వచ్చారు.
చదువంటే మమా సారాకు చాలా ఇష్టమట. ఒక మహిళ చదువుకుంటే ఆమె కుటుంబం మాత్రమే చదువుకున్నట్టు కాదని, యావత్ గ్రామం చదువుకున్నట్టని ఆమె తరచుగా చెప్పేవారట. చదువునే అవకాశం లేని వారికి ప్రభుత్వాలు ఆ అవకాశాలు కల్పించాలని ఆమె ఎప్పుడూ చెబుతుండేవారట. కాగా, మమా సారా మృతికి కిసుము నగర గవర్నర్ అన్యాంగ్ న్యోంగో సహా పలువురు సంతాపం తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తుపాకీతో కాల్చుకుని కార్పొరేటర్ కుమారుడు ఆత్మహత్య
మున్సిపల్ ఆఫీస్‌పై ఉగ్రవాదుల కాల్పులు.. గన్‌మ్యాన్, కౌన్సిలర్ దుర్మరణం
ఆ వృద్ధురాలు మృతి.. బీజేపీ, టీఎంసీ మధ్య మళ్లీ మాటల యుద్ధం
ఊరంతా కప్పేసిన మంచు దుప్పటి..!
గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి..!
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
లండన్‌లో ప్రియాంక చోప్రా హోలీ సంబురాలు
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

