న్యూఢిల్లీ, డిసెంబర్ 2: టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఐదు, పదేళ్లలో ప్రపంచం అణు యుద్ధాన్ని ఎదుర్కొంటుందని మస్క్ హెచ్చరించారు. ‘అణ్వాయుధాలు అగ్రరాజ్యాల మధ్య యుద్ధాన్ని నిరోధిస్తాయని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
అందుకే ఆ ప్రభుత్వాలపై బయటి శక్తుల నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు’ అని ఓ యూజర్ చేసిన వాదనపై మస్క్ స్పందిస్తూ రానున్న 5 సంవత్సరాలలో యుద్ధం అనివార్యమని, మహా అయితే 10 సంవత్సరాలని చెప్పారు. అయితే తన వ్యాఖ్యలను ఆయన వివరించే ప్రయత్నం చేయలేదు. కాగా, మస్క్ వ్యాఖ్యలు వెంటనే వైరల్ అయ్యాయి.