చైనీయులు పచ్చి అబద్దాలకోరులన్న కిమ్.. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి వెల్లడి
Mike Pompeo | చైనీయులు అబద్దాలకోరులని ఒకానొక సందర్భంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తనతో చెప్పాడని అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు.
వాషింగ్టన్: చైనీయులు అబద్దాలకోరులని ఒకానొక సందర్భంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తనతో చెప్పాడని అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు. మైక్ పాంపియో ‘నెవర్ గివ్ యాన్ ఇంచ్: ఫైటింగ్ ఫర్ ద అమెరికా ఐ లవ్’ పేరుతో రాసుకున్న ఆత్మకథ మంగళవారం మార్కెట్లో విడుదలైంది. చైనీయులను కిమ్‌జోంగ్ ఉన్ అబద్దాలకోరులు అన్న విషయాన్ని పాంపియో తన పుస్తకంలో రాశారు.
అంతేకాదు, చైనా ఆధిపత్యం నుంచి తనకు రక్షణ కోసం పొరుగుదేశం దక్షిణకొరియాలో అమెరికా బలగాలు ఉండటం తనకు అవసరమని కూడా కిమ్ తనతో చెప్పినట్లు మైక్ పాంపియో తన ఆత్మకథలో పేర్కొన్నాడు. అమెరికా-ఉత్తరకొరియా సదస్సుకు మూడు నెలల ముందు 2018, మార్చి 30న తాను తొలిసారి ఉత్తరకొరియా పర్యటకు వెళ్లిన సందర్భంగా.. చైనా గురించి కిమ్ తన ఆందోళన వ్యక్తం చేసినట్లు పాంపియో తెలిపాడు.
దక్షిణకొరియా నుంచి అమెరికా బలగాలు తప్పుకోవాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ బలంగా కోరుకుంటున్నట్లు చైనా తమకు పదేపదే చెబుతుందిగా అని తాను కిమ్ ముందు ప్రస్తావించానని, దాంతో కాసేపు పగలబడి నవ్వుతూ టేబుల్‌ను చరిచిన కిమ్ చైనీయులు పచ్చి అబద్దాలకోరులని వ్యాఖ్యానించాడని పాంపియో వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

