North Korea | న్యూఢిల్లీ, నవంబర్ 7: అప్పటివరకు ఇంటర్నెట్ వాడకంపై ఆంక్షలతో అరకొరగా దానిని వాడిన ఉత్తర కొరియా సైనికులు రష్యాలో అడుగుపెట్టగానే ఒక్కసారి జూలు విదిల్చారు. అక్కడ అపరిమితంగా లభిస్తున్న ఇంటర్నెట్ వల్ల అశ్లీల చిత్రాలు చూడటంలో నిమగ్నమయ్యారు.
ఈ విషయాన్ని బ్రిటన్ వార్తా సంస్థ ది ఫెనాన్షియల్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం ఉత్తర కొరియా తమ దేశానికి చెందిన వందలాది మంది సైనికులను రష్యాకు పంపింది.