North Korea: ఎలక్ట్రోమ్యాగ్నటిక్, బ్లాకౌట్ బాంబులను పరీక్షించిన ఉత్తర కొరియా
North Korea: ఎలక్ట్రోమ్యాగ్నటిక్ వెపన్స్, కార్బన్ ఫైబర్ బాంబులను ఉత్తర కొరియా పరీక్షించింది. వీటితో పాటు న్యూ మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా పరీక్షించినట్లు ఆ దేశ మీడియా పేర్కొన్నది. మూడు రోజుల పాటు ఆ పరీక్షలు జరిగినట్లు ఉత్తర కొరియా జనరల్ కిమ్ జాంగ్ సిక్ తెలిపారు.
న్యూఢిల్లీ: కొత్త తరహా హైటెక్ ఆయుధాలను ఉత్తర కొరియా(North Korea) పరీక్షించింది. ఎప్పుడూ బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలతో హోరెత్తించే ఆ దేశం ఇప్పుడు తాజాగా ఎలక్ట్రోమ్యాగ్నటిక్ వెపన్స్, కార్బన్ ఫైబర్ బాంబులను పరీక్షించింది. వీటితో పాటు న్యూ మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా పరీక్షించినట్లు ఆ దేశ మీడియా పేర్కొన్నది. మూడు రోజుల పాటు ఆ పరీక్షలు జరిగినట్లు ఉత్తర కొరియా జనరల్ కిమ్ జాంగ్ సిక్ తెలిపారు. దేశ ఆయుధ బాండాగారంలో కొత్త తరహా ఆయుధాలు చేరాయని, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ సిస్టమ్‌తో పాటు కార్బన్ ఫైబర్ బాంబులు ప్రత్యేక అసెట్స్ కానున్నట్లు చెప్పారు. అయితే ఈ కొత్త తరహా ఆయుధాల గురించి ఆయన ఎక్కువ సమాచారం ఇవ్వలేదు.
నార్త్ కొరియా భూభాగం నుంచి అనేక మిస్సైళ్లను లాంచ్ చేసినట్లు గుర్తించామని దక్షిణ కొరియా మిలిటరీ పేర్కొన్నది. ఆ ప్రొజెక్టైల్స్ సుమారు 240 నుంచి 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంటాయని పేర్కొన్నారు. బ్లాకౌట్ కార్బన్ ఫైబర్ బాంబ్‌లతో.. ఎలక్ట్రిక్ గ్రిడ్లు, పవర్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేయవచ్చు. ఆ బాంబుల నుంచి విడుదలయ్యే గ్రాఫైట్ ఫిలమెంట్లు ఎలక్ట్రిక్ గ్రిడ్లలో షార్ సర్య్యూట్ అయ్యేలా చేస్తాయి. నాన్ న్యూక్లియర్ ఎలక్ట్రోమ్యాగ్నటిక్ పల్స్ వెపన్ ఓ ప్రత్యేకమైన డివైస్. దీనితో మిలిటరీ అసెట్స్‌లో ఉన్న ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను న్యూట్రలైజ్ చేయవచ్చు. రేడార్ వ్యవస్థలను, విమానాలను ఈఎంపీ వెపన్తో నిర్వీర్యం చేయవచ్చు. హాసాంగ్-11 అణు సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణికి కొత్త తరహా క్లస్టర్ వార్‌హెడ్‌ను అమర్చి పరీక్ష చేసినట్లు ఉత్తరకొరియా మీడియా పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

