2000 కిలోమీటర్ల ఎత్తుకు మిస్సైల్.. ఫోటోలు రిలీజ్ చేసిన ఉత్తర కొరియా

ప్యోంగ్యాంగ్: ఈ ఏడాది ఆరంభం నుంచి ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలతో హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే. బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షిస్తున్న ఆ దేశం ఆదివారం కూడా ఓ భారీ పరీక్షను చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఆ అతిపెద్ద మిస్సైల్ పరీక్షకు చెందిన ఫోటోలను ఇవాళ ఉత్తరకొరియా అధికారిక మీడియా రిలీజ్ చేసింది. 2017 తర్వాత అతి పెద్ద పరీక్ష ఇదే అని చెప్పుకుంటున్న ఆ దేశం.. సముద్ర మట్టానికి సుమారు 2000 కిలోమీటర్ల ఎత్తు నుంచి మిస్సైల్ తీసిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో కొరియా ద్వీపకల్పంతో పాటు సమీప ప్రాంతాలు స్పష్టంగా కనిపిస్తాయి. మధ్యంతర శ్రేణికి చెందిన హాసాంగ్-12 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు ఉత్తర కొరియా వెల్లడించింది.

నార్త్ కొరియా పరీక్షించిన క్షిపణి సుమారు 1242 మైళ్ల ఎత్తుకు చేరుకున్నట్లు దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ప్రకటించాయి. ఆ మిస్సైల్ జపాన్ సముద్ర జలాల్లో కూలినట్లు చెప్పాయి. ఆ రెండు దేశాలు ఉత్తర కొరియా నిర్వహించిన పరీక్షలను ఖండించాయి. కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ఈ నెలలోనే ఇప్పటికే ఏడు మిస్సైళ్లను పరీక్షించింది. అయితే ఆకాశం నుంచి మిస్సైల్ తీసిన తాజా ఫోటోలను కేసీఎన్ఏ ఏజెన్సీ రిలీజ్ చేసింది. మిస్సైల్ వార్‌హెడ్‌కు ఫిక్స్ చేసిన కెమెరా ఆ ఫోటోలను తీసినట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
మిస్సైల్ లాంచింగ్‌కు సంబంధించిన రెండు ఫోటోలను కూడా ఆ దేశం రిలీజ్ చేసింది. సుమారు 30 నిమిషాల పాటు ఆ మిస్సైల్ 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు జపాన్, సౌత్ కొరియా అధికారులు వెల్లడించారు. మరో వైపు ఉత్తర కొరియా నిర్వహించిన మిస్సైల్ పరీక్షలను యునైటెడ్ నేషన్స్ ఖండించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

