North Korea: దక్షిణ కొరియా, అమెరికా మీద నిర్ధాక్షిణంగా దాడి చేయడమే ఉద్దేశం: ఉత్తరకొరియా
క్షిపణి పరీక్షల ఉద్దేశం దక్షిణ కొరియా, అమెరికా సైనిక స్థావరాల మీద దాడి చేయడమే
ఈమధ్య ఉత్తరకొరియా జరిపిన వరుస క్షిపణి పరీక్షల ఉద్దేశం ఏంటని సర్వత్రా ఆసక్తి మొదలైంది. అయితే, ఈ క్షిపణి పరీక్షల గురించి ఉత్తర కొరియా ఆర్మీ ఈరోజు ఒక ప్రకటన చేసింది. దక్షిణ కొరియా, అమెరికాలోని కీలకమైన సైనిక స్థావరాలు, కమాండింగ్ కేంద్రాల మీద నిర్ధాక్షిణంగా దాడులు చేయడమే ఈ క్షిపణి పరీక్షల లక్ష్యమని చెప్పింది. ఉత్తరకొరియా పోయిన వారంలో సముద్రం మీద 12 క్షిపణుల్ని టెస్ట్ చేసింది. వీటిలో బాలిస్టిక్ క్షిపణి కూడా ఉంది. యుద్ధ విమానాల్ని కూడా పరీక్షించింది. తాము పరీక్షించిన క్షిపణుల్లో కొన్నింటికీ అణుఇంధనాన్నిమోసుకెళ్లే సామర్థ్యం ఉందని చెప్పింది ఉక్రెయిన్ సైన్యం. ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేయడంతో దక్షిణ కొరియాతో పాటు జపాన్లోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.
ఏమాత్రం తగ్గకూడదని
దక్షిణ కొరియా, అమెరికా సైన్యాలు కలిసి ఈమధ్యే వార్ డ్రిల్ నిర్వహించాయి. అందుకు ప్రతిచర్యగా ఉత్తరకొరియా సైన్యం కూడా తమ క్షిపణుల్ని పరీక్షించింది. సైన్యం, క్షిపణులు, ఆయుధ సంపత్తిలో శతృదేశాలైన దక్షిణ కొరియా, అమెరికాకు ఏమాత్రం తగ్గకూడదనేది ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ యున్ ఆలోచన. అందుకని ఆ దేశాలతో ఏ క్షణంలోనైనా తలపడేందుకు తమ క్షిపణుల్ని, యుద్ధ విమానాల్ని సిద్ధంగా ఉంచాలని కిమ్ తమ సైన్యాధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

