Ballistic Missiles: మూడు బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
Ballistic Missiles: మూడు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్లను ఇవాళ నార్త్ కొరియా పరీక్షించింది. తూర్పు సముద్రంలోకి వాటిని విడుదల చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సమయంలో.. ఉత్తర కొరియా ఈ క్షిపణులను పరీక్షించినట్లు తెలుస్తోంది.
ప్యోంగ్యాంగ్: నార్త్ కొరియా ఇవాళ పలు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైళ్ల(Ballistic Missiles)ను పరీక్షించింది. తూర్పు సముద్రంలోకి వాటిని విడుదల చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్.. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సమయంలో.. ఉత్తర కొరియా ఈ క్షిపణులను పరీక్షించినట్లు తెలుస్తోంది. రెండు నెలల తర్వాత తొలిసారి ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఉదయం 7.44 నిమిషాల నుంచి 8.22 నిమిషాల మధ్య ఫైరింగ్ జరిగినట్లు సౌత్ కొరియా జాయింట్ చీఫ్ ఆప్ స్టాఫ్ తెలిపారు. ఆ మిస్సైల్స్ సుమారు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. ఆ తర్వాత అవి తూర్పు సముద్రం(సీ ఆఫ్ జపాన్)లో ల్యాండ్ అయ్యాయి.
ఉత్తర కొరియా కనీసం మూడు క్షిపణులను ప్రయోగించి ఉంటుందని భావిస్తున్నారు. కేఎన్-24 మిస్సైల్స్ తరహాలో అవి ప్రయాణించినట్లు అంచనా వేస్తున్నారు. కేఎన్-24.. సాలిడ్ ఫ్యూయల్ బాలిస్టిక్ మిస్సైల్. అది సుమారు 410 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఆ మిస్సైల్ దాదాపు 500 కేజీల బరువున్న పేలోడ్ను మోసుకెళ్లగలదు. ఉత్తర కొరియా నిర్వహించిన మిస్సైల్ పరీక్షలను జపాన్ ప్రధాని కిషిద ఖండించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

