Norovirus | లండన్, ఫిబ్రవరి 23: యూకేలో నోరో వైరస్ విజృంభిస్తున్నది. రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతున్నది. గత ఏడాదితో పోల్చితే రోగుల సంఖ్య రెట్టింపు అయ్యిందని గణాంకాలు చెబుతున్నాయి. నోరో వైరస్ రోగుల్లో వాంతులు, విరేచనాలు తలెత్తుతున్నాయి. దీంతో దీనిని ‘వోమ్టింగ్ బగ్’ అని కూడా పిలుస్తున్నారు. అమెరికా, ఇతర యూ రప్ దేశాలకు కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు భావిస్తున్నారు. కొత్త వేరియెంట్ ‘జీఐఐ.17’ వేగంగా విస్తరిస్తున్నదని, తక్కువ రోగ నిరోధక ఉన్నవాళ్లు వైరస్‌బారిన పడుతున్నారని బ్రిటిష్ హెల్త్, సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ ప్రతినిధి చెప్పారు.
ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా
మాస్కో, ఫిబ్రవరి 23 : ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలై సోమవారంతో సరిగ్గా మూడేండ్లు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్‌లోని వివిధ నగరాలే లక్ష్యంగా ఏకబిగిన వరుసగా 267 డ్రోన్ల వర్షం కురిపించింది. యుద్ధం మొదలైన తర్వాత ఉక్రెయిన్‌పై ఈస్థాయిలో రష్యా డ్రోన్ దాడులను చేపట్టడం ఇదే మొదటిసారి. ఒకే రోజు రికార్డ్ స్థాయిలో 267 డ్రోన్స్‌ను ఉక్రెయిన్‌పై ప్రయోగించిందని, ఇందులో 138 డ్రోన్లను కూల్చివేససినటట్టు ఆ దేశ వైమానిక దళ అధికార ప్రతినిధి యూరీ ఇగ్నత్ చెప్పారు. రష్యా డ్రోన్ దాడుల్లో ఏమేరకు నష్టం వాటిల్లిందన్న వివరాల్ని ఆయన వెల్లడించలేదు.