Goodenough | స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణలో కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీ(Lithium Ion batteries)కి ఆద్యుడు, నోబెల్ పురస్కార గ్రహీత (Nobel prize winner) జాన్ బీ గుడ్ ఎనఫ్ (100) (John B. Goodenough) కన్నుమూశారు. టెక్సాస్ (Texas)లోని ఆస్టిన్ (Austin)లో ఆదివారం మరణించినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్స్, టాబ్స్ సహా ఎలక్ట్రిక్ వాహనాలకు లిథియం అయాన్ బ్యాటరీ చాలా అవసరం అన్న విషయం తెలిసిందే. 1980లో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో పనిచేసే సమయంలో గుడ్ ఎనఫ్ .. లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ క్యాథోడ్ బ్యాటరీని అభివృద్ధి చేశారు. బ్రిటిష్ కెమిస్ట్ డాక్టర్ విట్టింగ్ హమ్ అభివృద్ధి చేసిన డిజైన్ ను గుడ్ ఎనఫ్ మరింత మెరుగుపరిచారు. అధిక ఇంధన నిల్వ సామర్థ్యం, భద్రతను మెరుగుపరిచారు. లిథియం అయాన్ బ్యాటరీ ఆవిష్కరణలో ముఖ్యపాత్ర పోషించినప్పటికీ తర్వాతి కాలంలో ఆయన రాయల్టీని పొందలేదు. బ్రిటిష్ ఆటోమిక్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేషన్ తో బ్యాటరీ పరిశోధనపై హక్కులకు సంబంధించి సంతకం పెట్టేశారు. ఇక 2019లో 97 ఏళ్ల వయసులో డాక్టర్ గుడ్ ఎనఫ్ నోబెల్ పురస్కారం అందుకున్నారు.
Also Read..
New York Diwali | ఇకపై న్యూయార్క్ లో దీపావళి నాడు స్కూళ్లకు హాలిడే.. ప్రకటించిన మేయర్
Air India | మరోసారి మలమూత్ర విసర్జన ఘటన.. వ్యక్తి అరెస్ట్
World Cup | వరల్డ్ కప్ ట్రోఫీని నింగిలోకి పంపిన ఐసీసీ.. వీడియో