శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 24, 2020 , 14:09:31

నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత‌కు క‌రోనా

నోబెల్ శాంతి బ‌హుమ‌తి గ్ర‌హీత‌కు క‌రోనా

హైద‌రాబాద్‌: నోబెల్ శాంతి బ‌హుమ‌తి గెలిచిన ఫిన్‌ల్యాండ్ మాజీ అధ్య‌క్షుడు మార్టి అహ‌తిసారికి.. క‌రోనా వైర‌స్ సోకింది. వైద్య ప‌రీక్ష‌లో ఆయ‌న పాజిటివ్ తేలారు. ఈ విష‌యాన్ని ఆ దేశ అధ్య‌క్ష కార్యాల‌యం వెల్ల‌డించింది. 2008లో మార్టి.. నోబెల్ శాంతి బ‌హుమ‌తి గెలుచుకున్నారు. 

చిలీ దేశం ఓ క్రూయిజ్ షిప్‌ను త‌మ జ‌లాల్లో నిలిపివేసింది. ఆ నౌక‌లో సుమారు 1800 మంది ఉన్నారు.  దాంట్లో 42 మంది ఫ్లూ ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్నారు. క‌రోనా వ్యాప్తి చెందుతుంద‌న్న భ‌యంతో.. ఆ క్రూయిజ్‌ను డాకింగ్ చేయ‌డం లేదు. హోలాండ్ అమెరికా కార్నివాల్ గ్రూపు ఆ నౌక‌ను న‌డుపుతున్న‌ది. మార్చి 7వ తేదీన అది బ్యూనోస్ ఏరిస్ నుంచి బ‌య‌లుదేరింది.  ప్ర‌యాణికులు, సిబ్బందిలో కొంద‌రు అనారోగ్యంగా ఉన్న‌ట్లు క్రూయిజ్ సంస్థ పేర్కొన్న‌ది. 


logo