No pants subway ride | ప్లాంట్లు లేని రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ అమెరికాలో ఏటా నో ప్యాంట్ సబ్వే రైడ్ ను నిర్వహింస్తుంటారు. ఈ ఈవెంట్‌ను ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తికావడంతో వారికి మద్దతుగా లండన్‌లో నోట ట్రౌజర్ ట్యూబ్ రైడ్ ను చేపట్టారు. ఈ ఈవెంట్లో వందలాది మంది ప్రజలు ప్యాంటు లేకుండా రైళ్లో ప్రయాణించారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రెండు సంవత్సరాలపాటు ఈ కార్యక్రమం జరుగలేదు. ప్రస్తుతం పెద్ద సంఖ్యలో ప్రజలు ప్యాంటు వేసుకోకుండా రైళ్లో ప్రయాణించి ఆనందించారు. ఈ ఈవెంట్‌కు ఎలాంటి ఎజెండా లేదు. జస్ట్ సరదా కోసమే చేపడుతుండటం విశేషం.
ఈ కార్యక్రమాన్ని ది స్టిఫ్ అప్పర్ లిప్ సొసైటీ నిర్వహించింది. ఈ ఈవెంట్ 2002 లో న్యూయార్క్‌లో ఇంప్రూవ్ ఎవ్రీవేర్ ద్వారా ప్రారంభించిన వార్షిక గ్లోబల్ ఈవెంట్‌గా ది నో ప్యాంట్స్ సబ్వే రైడ్ చేపట్టారు. ఆదివారం జరిగిన ఈ ఈవెంట్లో లండన్‌తో పాటు వివిధ దేశాల నుంచి కూడా ప్రజలు పాల్గొన్నారు. మగవాళ్లే కాకుండా ఆడవాళ్లు కూడా ప్యాంట్లు ధరించకుండా రైళ్లలో ప్రయాణించారు.
ఈ ఈవెంట్‌ను చేపట్టేందుకు ఎలాంటి రీజన్ మాత్రం లేదు. జస్ట్ ఫన్ పొందేందుకే ఇలా ప్యాంట్లు వేసుకోకుండా రైలు ప్రయాణం చేస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈ రైడ్‌ను రెండేండ్ల పాటు నిలిపేశారు. అయితే, కొవిడ్ తగ్గిపోవడంతో తిరిగి ఈ ఈవెంట్ అమల్లోకి వచ్చింది. ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నది.