స్టూడెంట్, వర్కర్ వీసాలకు వర్తింపు
వాష్టింగ్టన్: అమెరికా వీసాల కోసం జరిగే ఇంటర్వ్యూలను ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఆ దేశం రద్దు చేసింది. విద్యార్థులు (ఎఫ్, ఎం, అకడమిక్ జే వీసాలు), వర్కర్లు (హెచ్1, హెచ్2, హెచ్3, వ్యక్తిగత ఎల్ వీసాలు), సాంస్కృతిక, పలు రంగాల్లో నిపుణులు (ఓ, పీ, క్యూ వీసాలు) ఇందుకు అర్హులని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. అయితే అభ్యర్థులు గతంలో ఏదైనా ఒక కేటగిరీకి చెందిన అమెరికా వీసా పొంది ఉండాలని, ఒక్కసారి కూడా రిజెక్ట్ కాకూడదని, ఎలాంటి అనర్హతలు ఉండొద్దని నిబంధనలు విధించారు. వీసా దరఖాస్తుదారులకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సలహాదారు అజయ్ జైన్ భుటోరియా పేర్కొన్నారు.