Nikki Haley | చార్లెస్టన్: రిపబ్లి కన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తనతో పోటీ పడుతున్న పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించారు. లెక్కించిన 90 శాతం ఓట్లలో ట్రంప్‌కు 59.9 శాతం ఓట్లు రాగా, నిక్కి హేలీకి 39.4 శాతం వచ్చాయి. ఇంతకుముందు వివిధ రాష్ర్టాలలో జరిగిన ఎన్నికల్లో సైతం ఆమె ట్రంప్ కన్నా ఓట్లలో 30 శాతం వెనుకబడి ఉన్నారు.