కాన్బెర్రా: ఆస్ట్రేలియన్ల కోసం తన దేశ సరిహద్దులను తెరవాలని న్యూజిలాండ్ (New Zealand) ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 12 నుంచి ఆస్ట్రేలియా పౌరులు తమ దేశంలో పర్యటించవచ్చని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా అడ్రెన్ (PM Jacinda Ardern) ప్రకటించారు. అనుకున్నదానికంటే ముందే ఆస్ట్రేలియన్లు ఇక్కడి రావడానికి అనుమతిస్తున్నామని జెసిండా చెప్పారు. దీనికోసం ఊహించినదానికింటే ముందుగానే సరిహద్దులను తెరుస్తున్నామని వెల్లడించారు.
ఇక అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ సహా వీసా మినహాయింపులు ఉన్న దేశాల నుంచి వచ్చేవారికి కూడా న్యూజిలాండ్‌లో పర్యటించేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇలాంటివారికి మే 1 నుంచి న్యూజిలాండ్‌లో ప్రయాణించవచ్చని చెప్పారు.
కాగా, ఆస్ట్రేలియా పర్యాటకుల కోసం జూలైలో, విసా మినహాయింపు ఉన్న దేశాల ప్రయాణికుల కోసం అక్టోబర్‌లో సరిహద్దులను తెరవాలని న్యూజిలాండ్ ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే ఒమిక్రాన్ వేరియంట్ అంతరించడంతో సరిహద్దులను ఓపెన్ చేయడానికి జెసిండా సర్కార్ ఓకే చెప్పింది. దీంతో దేశంలో పర్యాటకరంగం మళ్లీ కొలుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నది.