న్యూయార్క్: బోన్ మ్యారో క్యాన్సర్ (ఎముక మజ్జ క్యాన్సర్)కు ఇప్పటివరకూ సరైన చికిత్స లేదు. ఈ క్యాన్సర్ పనిపట్టే సరికొత్త చికిత్సను అమెరికా పరిశోధకులు ఆవిష్కరించారు. ఈ చికిత్సా విధానంలో ‘టాల్కెటామాబ్’ అనే డ్రగ్‌ను రోగులకు ఇంజెక్ట్ చేశారు. రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ డ్రగ్ ఎముకమజ్జ క్యాన్సర్ కణాలను నాశనం చేసేందుకు రోగనిరోధక వ్యవస్థను 73 శాతం ప్రేరేపించినట్టు పరిశోధకులు గుర్తించారు. ఇది క్యాన్సర్ కణాల ఉపరితలంపై ఉన్న ‘జీపీఆర్సీ5డీ’ అనే గ్రాహకాన్ని లక్ష్యంగా చేసుకొన్నట్టు తేల్చారు.