న్యూయార్క్: పార్కిన్సన్స్ను ప్రారంభ దశలోనే గుర్తించే కొత్త పద్ధతిని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిద్వారా లక్షణాల ప్రారంభానికి ముందే వ్యాధిని గుర్తించి చికిత్స చేయొచ్చని తెలిపారు. ఇప్పటివరకు పార్కిన్సన్స్ వ్యాధి నిర్ధారణకు ఎలాంటి పరీక్ష లేనందున గుర్తించడం కష్టంగా మారింది.
ఈ వ్యాధికి సంబంధించిన అసాధారణ ప్రొటీన్లను గుర్తించేందుకు తాము అల్ఫా- సిన్యూక్లిన్ సీడ్ యాంప్లిఫికేషన్ అస్సే అనే కొత్త విధానాన్ని అభివృద్ధి చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిద్వారా వ్యాధిని వేగంగా గుర్తించి సరైన చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.