US Elections | అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ మొదలైన కొన్ని గంటలకే తొలి ఫలితం కూడా వచ్చేసింది. ఓ చిన్న కౌంటీలో ఓటింగ్ పూర్తైన వెంటనే ఫలితాన్ని వెల్లడించారు.
న్యూహ్యాంప్‌షైర్ (New Hampshire) రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్ (Dixville Notch)లో మొత్తం ఆరుగురు ఓటర్లు ఉన్నారు. అందులో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris)కు మూడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు మూడు ఓట్లు పోలయ్యాయి. ఓటింగ్ పూర్తైన 15 నిమిషాల తర్వాత ఫలితాలను వెల్లడించారు.
కాగా, 2020లో డిక్స్‌విల్లే నాచ్ వాసులు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కే ఓటు వేశారు. ఆ ఎన్నికల్లో ఆయనే విజయం కూడా సాధించారు. కాగా, ఎలక్షన్ డే రోజున డిక్స్‌విల్లే నాచ్‌లో అర్ధరాత్రి నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశంలోనే తొలి ఫలితం వెలువడే ప్రదేశంగా ఈ కౌంటీ పేరుగాంచింది.
(1/2) ⬇️ In Dixville Notch, New Hampshire, both Kamala Harris and Donald Trump received three votes each, reflecting the tight national race.
The town, with just six voters, continues its tradition of being the first to report results. #USElection2024 #DixvilleNotch #US pic.twitter.com/9Aa6NAXenl
— British Pakistani Index (@PakistaniIndex) November 5, 2024
Also Read..
Kamala Harris | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతుగా.. తమిళనాడులో ప్రత్యేక పూజలు
Parliaments Winter Session | 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. ప్రకటించిన కేంద్రం