జురిచ్: మద్యం తాగేటప్పుడు అది ఇచ్చే సంతోషం ఎంతో కానీ తెల్లవారి కలిగే హ్యాంగోవర్ మాత్రం దిమ్మ తిరిగేలా చేస్తుంది. హ్యాంగోవర్‌తో పాటు మద్యపానం వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించేందుకు స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు కొత్త జెల్‌ను తయారుచేశారు. ఐరన్, గ్లూకోజ్, గోల్డ్‌తో చేసిన మిశ్రమాన్ని వే ప్రొటీన్‌తో తయారుచేసిన జెల్‌తో కలిపి చిన్న పిల్స్‌లా రూపొందించారు.
వీటిని మద్యపానం ప్రారంభించే అర గంట ముందు వేసుకోవాలని వీరు తెలిపారు. సాధారణంగా మద్యం తాగగానే కడుపు, ప్రేగుల ద్వారా రక్తంలో కలిసి శరీరమంతా ప్రవహిస్తుంది. మద్యంలోని ఇథనాల్‌ను కాలేయం ఎసిటాల్డిహైడ్గా మారుస్తుంది. హ్యాంగోవర్‌కు ఇదే ప్రధాన కారణం. ఆ తర్వాత ఇది ఎసిటిక్ యాసిడ్‌గా మారి మూత్రం ద్వారా శరీరం బయటకు వెళ్లిపోతుంది. ఈ జెల్ వేసుకుంటే మాత్రం మద్యం రక్తంలో కలవకముందే ఎసిటిక్ యాసిడ్‌గా మారిపోతుందని, తద్వారా హ్యాంగోవర్ సమస్య ఉండదని, మద్యపాన దుష్ప్రభావాలు కూడా తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు.