లండన్: కరోనా వైరస్‌కు చెందిన మరో కొత్త వేరియంట్‌ను బ్రిటన్‌లో గుర్తించారు. ఇప్పటి వరకు 16 మందికి ఈ వేరియంట్ సోకినట్లు నిర్ధారించారు. కరోనా వేరియంట్ బి.1.621గా దీనిని గుర్తించినట్లు బ్రిటన్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వేరియంట్ గురించి పెద్దగా తెలియదని చెప్పింది. టీకాలను ప్రభావితం చేసే లేదా మరింత తీవ్రమైన అనారోగ్యానికి ఇది దారితీయవచ్చని సూచించడానికి ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. కరోనా కొత్త జాతి బ్రిటన్ ప్రజలలో ఎలాంటి భయాలను వ్యాప్తి చేయదని అన్నారు.
మరోవైపు SARS-CoV-2కు చెందిన B.1.621 వేరియంట్ బ్రిటన్‌కు కొత్త వేరియంట్ కావచ్చని, అయితే ఇది ప్రపంచానికి కొత్తది కాదని ఆ దేశ ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ వేరియంట్‌ను కొలంబియాలో మొదట జనవరి నెలలో గుర్తించినట్లు వెల్లడించారు. విదేశీ ప్రయాణికులకే ఈ కొత్త వేరియంట్ సోకిందని, బ్రిటన్‌లో వ్యాప్తి చెందినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని వివరించారు.