నెదర్లాండ్స్: దయచేసి బీచ్‌లలో బహిరంగ శృంగారం మానేయండని నెదర్లాండ్స్‌లోని ఓ మున్సిపాలిటీ పర్యాటకులకు విజ్ఞప్తి చేస్తున్నది. అదే దక్షిణ నెదర్లాండ్స్‌లోని వీరే పట్టణ మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీ పాలకులు న్యూడిస్ట్ బీచ్‌లు, ఇసుక దిబ్బలలో పర్యాటకులు శృంగారంలో పాల్గొనకుండా నివారించేందుకు ఒక ప్రచారాన్ని ప్రారంభించారు. బహిరంగ శృంగారం ప్రకృతిని, పర్యావరణాన్ని పాడు చేస్తున్నదని, న్యూడిస్ట్ బీచ్‌లు, ఇసుక దిబ్బల పరిసరాల్లో ప్రకటనలు వేయించింది. అంతేగాక నిత్యం ఆయా ప్రాంతాలకు వచ్చే పర్యాటకులకు హెచ్చరికలు చేస్తున్నది.
న్యూడిస్ట్ బీచ్‌లు, ఇసుక దిబ్బల్లో పూర్తి నగ్నంగా జరుగుతున్న బహిరంగ శృంగారాలపై స్థానిక ప్రభుత్వానికి, వాటర్ బోర్డుకు, ప్రకృతి సంస్థలకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని వీరే పట్టణ మేయర్ ఫ్రెడరిక్ ష్కౌవనార్ తెలిపారు. ఇసుక దిబ్బలు స్థానిక సమాజానికి చాలా ముఖ్యమైనవని, అక్కడి సహజ పర్యావరణాన్ని దెబ్బతీసే ఈ శృంగార చర్యలు.. సెలవుల్లో సేదదీరేందుకు వచ్చే ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయని, అక్కడి నీటిని, ప్రకృతిని కలుషితం చేస్తాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎక్కువ కాలం ఇలా హెచ్చరికలు చేస్తూ ఉండబోదని, బహిరంగ శృంగార నిషేధానికి న్యూడిస్ట్ బీచ్‌లు, ఇసుక దెబ్బల దగ్గర కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని మేయర్ ప్రకటించారు. కాగా అవుట్డోర్ సెక్స్ అనేది నగ్న వినోదం కాదని నేక్డ్ రిక్రియేషన్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. సూర్య స్నానంలో నగ్న వినోదం ఉంటుందని అన్నారు. సూర్యస్నానికి వచ్చే వ్యక్తులు ఇతర వ్యక్తుల్లా అసభ్యంగా ప్రవర్తించరని, పూర్తి నగ్నంగా స్నానం చేయడం ఓ నిజమైన అనుభూతిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. అసభ్యత లేకుండా నగ్న శరీరాలను చూడటం చాలా ఆరోగ్యకరమని చెప్పారు.