Netflix | పాస్వర్డ్ షేరింగ్‌పై నెట్‌ఫ్లిక్స్ కీలక నిర్ణయం.. ఇకపై అలా చేస్తే అధిక రుసుము చెల్లించాల్సిందే
Netflix | ఓటీటీ (OTT) సంస్థల్లో రారాజుగా వెలుగుతున్న నెట్‌ఫ్లిక్స్ (Netflix ).. పాస్వర్డ్ షేరింగ్ (Password Sharing) విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కుటుంబ సభ్యులతో మాత్రమే పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది.
Netflix | ఓటీటీ (OTT) సంస్థల్లో రారాజుగా వెలుగుతున్న నెట్‌ఫ్లిక్స్ (Netflix ).. పాస్వర్డ్ షేరింగ్ (Password Sharing) విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కుటుంబ సభ్యులతో మాత్రమే పాస్‌వర్డ్‌ను షేర్ చేసుకునేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఫ్యామిలీ మెంబర్స్ ( single household) కాకుండా ఇతరులతో పాస్వర్డ్ షేర్ చేసుకుంటే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, ఈ నిబంధనలు భారత్‌లో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయన్నది మాత్రం తెలియజేయలేదు.
ఈ విధానాన్ని ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అవి మంచి ఫలితాలను ఇవ్వడంతో అమెరికా (America) సహా మొత్తం వందకు పైగా దేశాల్లో అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. పాస్వర్డ్ షేరింగ్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ తమ యూజర్లకు ఈ-మెయిల్స్ పంపుతోంది. ఇంట్లోవారు కాకుండా బయటి వ్యక్తులతో పాస్వర్డ్ షేర్ చేసుకుంటే ఇకపై అదనంగా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని అందులో తెలిపింది. అమెరికాలో ఈ ఫీజును నెలకు 7.99 డాలర్లు కాగా, యూకేలో 4.99 యూరోలుగా నిర్ణయించినట్లు తెలిపింది. కాగా, కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడంలో భాగంగానే పాస్వర్డ్ షేరింగ్‌పై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, నెట్‌ఫ్లిక్స్ నిర్ణయంపై యూజర్లలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాస్వర్డ్ కుటుంబ సభ్యులతోనే షేర్ చేస్తున్నామా..? లేక వేరేవాళ్లతో పంచుకుంటున్నామా..? అన్నది నెట్‌ఫ్లిక్స్‌కు ఎలా తెలుస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై కూడా కంపెనీ స్పష్టతనిచ్చింది. ఐపీ అడ్రస్‌లు, డివైజ్ ఐడీలు, అకౌంట్ యాక్టివిటీ ఆధారంగా దీన్ని నిర్ధారిస్తామని తెలిపింది. అయితే, యూజర్ల జీపీఎస్ డేటాను మాత్రం సేకరించబోమని స్పష్టం చేసింది.
Also Read..
Hansika Motwani | టాలీవుడ్ హీరో ఇబ్బంది పెట్టాడంటూ వార్తలు.. స్పందించిన నటి హన్సిక
Amazon | అమెజాన్ తీరుపై ఉద్యోగుల అసహనం : ఈనెల 31న టెకీల నిరసన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

