జెరూసలెం : ఇజ్రాయెల్, హమాస్ (Israel-Hamas War) ఉగ్రమూకల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇరు పక్షాల మధ్య దాడులు, ప్రతిదాడులతో వేలాది మంది మరణించారు. ఇక ఐసిస్‌ను అణిచివేసిన తరహాలోనే హమాస్‌నూ ఉక్కుపాదంతో అణిచివేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతినబూనారు. ఐసిస్ మాదిరే హమాస్తోనూ వ్యవహరించాలని తనను కలిసిన అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆంటోని బ్లింకెన్‌తో భేటీ సందర్భంగా నెతన్యాహు పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపుదాడుల అనంతరం ఈ ప్రాంతంలో యుద్ధం కొనసాగుతుండగా ఇజ్రాయెల్, గాజాలో 3600 మందికి పైగా మృత్యువాతన పడ్డారు. గాజాలో విద్యుత్, ఆహారం, నీటి సరఫరాను బ్లాక్ చేయడం ద్వారా ఆ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడుతుండటంతో మూడు లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇండ్లను విడిచి పారిపోయారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇక ఇజ్రాయెల్‌లో హమాస్ దాడులతో భారత్‌లో నివసిస్తున్న ఇజ్రాయెల్ వాసులు భయాందోళన మధ్య రోజులు వెళ్లదీస్తున్నారు. స్వదేశంలో తమ ఆత్మీయుల భద్రతపై ఆరా తీస్తూ ఆందోళన చెందుతున్నారు. వీరిలో కొందరు ఇజ్రాయలీలు కొద్దికాలంగా భారత్‌లో నివసిస్తుండగా, మరికొందరు టూరిస్ట్‌లుగా ఇక్కడికి వచ్చారు.
ఇజ్రాయెల్‌లో మారణహోమంతో కలత చెందిన వీరు స్వదేశానికి చేరుకుని తమ వారి చెంతకు చేరాలని తహతహలాడుతున్నారు. హమాస్ మెరుపుదాడుల అనంతరం తమ కుటుంబసభ్యులతో మాట్లాడానని హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో నివసిస్తున్న ఇజ్రాయెల్ మహిళ కెనెరియత్ గుర్తుచేసుకున్నారు. హమాస్ మిలిటెంట్ల బాంబు దాడితలో తమ ఇల్లు దగ్ధమైందని ఆమె చెప్పుకొచ్చారు. తన సోదరుడితో తాను మాట్లాడనని, తమ కజిన్ హమాస్ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు.
భారత్‌లో తాము సురక్షితంగా ఉన్నా వీలైనంత త్వరలో ఇజ్రాయెల్ వెళ్లి కుటుంబసభ్యులను కలుసుకోవాలని ఉందని చెప్పారు. తమ స్వదేశం వెళ్లేందుకు తానెన్నడూ ఇంతగా భయపడలేదని అన్నారు. రాజస్ధాన్‌లోని పుష్కర్‌ను సందర్శించిన ఇజ్రాయెలీ టూరిస్ట్ అమత్ తాను స్వదేశం వెళ్లి ఇజ్రాయల్ రక్షణ బలగాల్లో చేరి హమాస్ ఉగ్రవాదులతో పోరాడతానని చెప్పాడు. మహిళలు, చిన్నారులు, సైనికులపై హమాస్ చేపడుతున్న దాడులను తిప్పికొట్టేందుకు ఈనెల 15న ఇజ్రాయెల్‌కు తిరుగుముఖం పట్టనున్నట్టు అమత్ తెలిపాడు.
Read More :