Balen Shah | నేపాల్ నూతన ప్రధాని బాలెన్ షాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ.. బాలెన్ షా స్పందన ఇదే
Balen Shah : నేపాల్ నూతన ప్రధానిగా బాలెన్ షా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.
Balen Shah : నేపాల్ నూతన ప్రధానిగా బాలెన్ షా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. బాలెన్ షా ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఆయన నాయకత్వంపై నేపాల్ ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు.
పరస్పర సహకారం, స్నేహం ద్వారా ఇరు దేశాల ప్రజలకు మేలు జరిగేలా బాలెన్ షా నాయకత్వంలో ఇండియా, నేపాల్ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలిపారు. ఎక్స్ వేదికగా మోదీ ఈ ట్వీట్ చేశారు. మోదీ అభినందనలకు నేపాల్ ప్రధాని బాలెన్ షా స్పందించారు. తనకు అభినందనలు తెలిపిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇరు దేశాల ప్రజల మేలు కోసం మోదీతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బాలెన్ షా ఆధ్వర్యంలోని పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది.
Thank you, PM @narendramodi for your kind words and warm wishes. I am eager to work closely with you to advance the multifaceted relations between our two countries for the common prosperity of our people. https://t.co/0YWdh8Jj36
— PMO (@PM_nepal_) March 28, 2026
శుక్రవారం బాలెన్ షా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌదెల్ ఆధ్వర్యంలో ప్రధాని ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నేపాల్ ఉపాధ్యక్షుడు రామ్ సహాయ ప్రసాద్ యాదవ్, చీఫ్ జస్టిస్ ప్రకాశ్ మాన్ సింగ్ రౌత్ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Balen Shah
- India
- Nepal
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

