అగ్ర కథానాయకుడు, బిగ్ బి అమితాబ్‌బచ్చన్ సోమవారం అర్థరాత్రి తన వ్యక్తిగత బ్లాగ్‌లో పెట్టిన ఓ పోస్ట్‌తో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇటీవల తాను శస్త్రచికిత్స చేయించుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆయన పోస్ట్‌లో తెలిపారు. అయితే సర్జరీ తాలూకు పూర్తి వివరాలు అమితాబ్ వెల్లడించలేదు. ఐసీయూలో తీసుకున్న చికిత్స కంటే డిశ్చార్జ్ తర్వాత ఇంటి దగ్గర కోలుకోవడం అది పెద్ద సవాలు అని అయన తెలిపారు. ‘నా జీవితంలో శారీరకంగా, మానసికంగా ఇది అత్యంత క్లిష్ట సమయం.
ఎంతటి విజేతలైనా ఏదో ఒకరోజు ఓటమిని ఎదుర్కోవాల్సిందే. ఈ పరిస్థితుల్ని కొందరు ధైర్యంగా ఎదుర్కొంటారు. కొందరు లొంగిపోతారు. ప్రయత్నం చేస్తూ ధైర్యంగా ఉండేవారే ఎప్పటికీ ఛాంపియన్లుగా నిలుస్తారు. అలా చేయలేని వారు గత వైభవంగా మిగిలిపోతారు.అందరూ ఆరోగ్యంగా ఉండండి’ అని అమితాబ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు అనారోగ్యం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని పోస్ట్‌లు పెడుతున్నారు.