శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 28, 2020 , 12:50:36

ప‌క్కింట్లో కాల్పులు జ‌రుగుతున్నాయ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు.. తీరా చూస్తే నిద్ర‌పోతున్నాడు!

ప‌క్కింట్లో కాల్పులు జ‌రుగుతున్నాయ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు.. తీరా చూస్తే నిద్ర‌పోతున్నాడు!

ఇరుగుపొరుగు వాళ్ల‌ని ప‌ట్టించుకునేది ప‌ల్లెటూల్లోనే. సిటీల్లో అయితే ఎవ‌రి జీవితం వారిది. ఎవ‌రి దారి వాళ్ల‌ది. అయినా జ‌ర్మ‌నీలోని ఓ ఇంట్లో జ‌రిగిన‌ ఎదురు కాల్పులు విని పొరిగింటి వాళ్లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఇంటి డోర్ లాక్ వేయ‌డంతో ఇంటి త‌లుపులు ప‌గుల గొట్టారు. తీరా లోప‌లికి వెళ్లి చూసేస‌రికి పోలీసులు షాక్ అయ్యారు.

ఎందుకంటే అక్క‌డ 34 ఏండ్ల వ్య‌క్తి ప‌డుకొని నిద్ర‌పోతున్నాడు. లోప‌ల ఇంకెవ‌రూ లేరు. ప‌క్క‌నే భారీ సౌండ్‌తో టీవీ ఆన్‌లో ఉంది. టీవీలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమా వ‌స్తుంది. ఈ శ‌బ్దాలు వింటే నిజంగా కాల్పులు జ‌రుగుతున్న‌ట్లే అనిపించింది. ఇంత పెద్ద సౌండ్ పెట్టుకొని టీవీ చూస్తూ ఇరుగుపొరుగు వాళ్ల‌ని భ‌యాందోళ‌న‌కు గురి చేసినందుకు అత‌న్ని స్టేష‌న్‌కు తీసుకెళ్లారు పోలీసులు. అందుకే టీవీ చూసేట‌ప్పుడు ఇంటి స‌భ్యుల‌కు విన‌ప‌డేలా వాల్యూమ్ పెట్టుకుంటే స‌రిపోతుంది. 


logo