న్యూయార్క్: అమెరికాలోని పోర్ట్లాండ్లో ఒక ఎమ్యూజ్మెంట్ పార్కులో అట్మాస్ ఫియర్ రైడ్ శుక్రవారం కొంతమందిని ఆకాశంలో తలకిందులుగా వేలాడదీసి భయోత్పాతం సృష్టించింది! చక్రం ఆకారంలో ఉండే ఈ రైడ్ కొన్ని వందల అడుగులు పైకి వెళ్లిన తర్వాత సాంకేతిక లోపంలో ఆగిపోవడంతో అందులో కూర్చున్న వారు అరగంటకు పైగా తలకిందులుగా వేళ్లాడుతూ రక్షించమంటూ ఆర్తనాదాలు చేశారు. అత్యవసర బృందాలు వచ్చి 28 మందిని సురక్షితంగా కిందకు దించాయి.