టెక్సాస్: ప్రత్యేక ఫీచర్లు ఉన్న టెంపో పరికరాన్ని(Tempo Device) నాసా నింగిలోకి పంపింది. ఆ పరికరంతో వాయు కాలుష్యాన్ని(Air Pollution) అధ్యయనం చేయనున్నారు. స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్ ద్వారా టెంపోను కక్ష్యంలోకి రిలీజ్ చేశారు. శుక్రవారం రాత్రి ఈ ప్రయోగం జరిగింది. టెంపోను ట్రోపోస్పియరిక్ ఎమిషన్స్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్ ఇన్స్ట్రుమెంట్గా పిలుస్తున్నారు. టెంపోతో అట్లాంటిక్ తీర ప్రాంతాలతో పాటు అమెరికా, మెక్సికో, కెనడా ప్రాంతాల్లో ఉన్న వాయు కాలుష్య విధానాన్ని ఎప్పటికప్పుడు స్టడీ చేయనున్నారు. ఉత్తర అమెరికాలో ఉన్న వాయు నాణ్యత గురించి గంట గంటకు టెంపో సమాచారం ఇస్తుందని నాసా తన ట్విట్టర్లో పేర్కొన్నది.