వాషింగ్టన్: 50 ఏండ్ల తర్వాత చంద్రుడి చెంతకు వ్యోమగాములను పంపేందుకు నాసా సిద్ధమైంది. ఆర్టెమిస్ II మిషన్ ద్వారా నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే… బుధవారం భారత కాలమానం ప్రకారం ఉదయం 3.54 గంటలకు నాసా రాకెట్ నింగిలోకి దూసుకెళుతుంది.
ఆర్టెమిస్ ప్రోగ్రామ్లో భాగంగా వ్యోమగాముల సహితంగా అమెరికా జరుపుతున్న మొదటి ప్రయోగం ఆర్టెమిస్ – IIనే. ఇందులోని వ్యోమగాములు చంద్రుడి కక్ష్యపై పరిశోధనలు జరిపి తిరిగి భూమి పైకి వస్తారు. వీరంతా జాబిల్లి పైన దిగకుండా దగ్గరగా ప్రయాణిస్తారు. సుమారు పది రోజుల పాటు భూ కక్ష్యను పరిశీలిస్తారు. ఈ వాహక నౌకలో అత్యాధునిక ప్రాణ రక్షణ వ్యవస్థను పొందుపరిచారు.