Narayan Khadka : కొత్త విదేశాంగ మంత్రిగా నారాయణ్ ఖడ్కా
Narayan Khadka : నేపాలీ కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ ఖడ్కా, విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా బుధవారం ఉదయం ...

ఖాట్మండు : (Narayan Khadka) నేపాలీ కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ ఖడ్కా, విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా బుధవారం ఉదయం ఖడ్కాను కొత్త విదేశాంగ మంత్రిగా నియమించారు. ఈ విషయాన్ని దేవుబా వ్యక్తిగత సెక్రటేరియట్ ధ్రువీకరించింది.
మధ్యాహ్నం తర్వాత ఖడ్కా చేత రాష్ట్రపతి విద్యా దేవి భండారీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాన మంత్రి దేవుబా సిఫారసు మేరకు రాష్ట్రపతి విద్యా దేవి భండారీ.. ఖడ్కాను మంత్రిగా నియమించినట్లు రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఆయనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగించారు. ఖడ్కా బుధవారం సాయంత్రం న్యూయార్క్ వెళ్లి.. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 76 వ సెషన్లో పాల్గొంటున్న నేపాల్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. రెండు నెలలకు పైగా పాలక సంకీర్ణంలో వివాదం కారణంగా మంత్రివర్గాన్ని విస్తరించడంలో దేవుబా ఇబ్బంది పడుతున్నారు.
భారతదేశంలో నేపాల్ రాయబారి నీలాంబర్ ఆచార్యను నేపాల్ ప్రభుత్వం వెనక్కు పిలిచింది. అదేవిధంగా మరో 12 మంది వివిధ దేశాల్లోని తమ రాయబారులను రీకాల్ చేసింది. వీరిని కేపీ శర్మ ఓలి ప్రభుత్వం గతంలో నియమించింది. దాంతో వీరిని వెనక్కు పిలుస్తూ షేర్ బహదూర్ దేవుబా ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశంతోపాటు చైనా, అమెరికా, ఇంగ్లండ్తోపాటు మొత్తం 12 మంది రాయబారులను రీకాల్ చేయాలని నిర్ణయించింది.
భారత్‌లో నేపాల్ రాయబారిగా మాజీ మంత్రి నీలాంబర్ ఆచార్యను కేపీ శర్మ ఓలి నియమించారు. ఇతర దేశాల్లోని రాయబారులు అలాగే కొనసాగుతారని, అలాగే ఉద్యోగాలను కొనసాగిస్తారని న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జ్ఞానేంద్ర బహదూర్ కర్కి చెప్పారు. వెనక్కి పిలిచిన రాయబారులు తిరిగి వచ్చేందుకు మూడు వారాల నుంచి నెల సమయం ఇచ్చారు. ఖాళీగా ఉన్న 23 దేశాలలో రాయబారులను నియమించే ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. 11 దేశాలలో అంబాసిడర్ పోస్టులు ఇప్పటికే చాలా కాలంగా ఖాళీగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
‘ఘాజీల భూమిపై గర్జిద్దాం’.. వివాదంలో ఎంఐఎం పోస్టర్
శ్రీరాముడి బస ఆధారంగా కొత్త టూరిజం సర్క్యూట్
వ్యాక్సిన్లపై యువకుడి వినూత్న ప్రమోషన్.. ఎక్కడంటే?
మెక్‌డోనాల్డ్స్ బర్గర్లో తేలు.. కేసు నమోదు
లక్షల మందిని బలిగొన్న ఇరాన్-ఇరాక్ యుద్ధానికి 41 ఏండ్లు
ఈ పాప.. తొలి ‘ఆన్లైన్ బేబీ’.. ఎలాగంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

