Nancy Pelosi | తైవాన్‌లో నాన్సీ పెలోసీ.. చైనా ఏకపక్ష చర్యలను వ్యతిరేకిస్తామని ప్రతీన
Nancy Pelosi | చైనా హెచ్చరికలు తోసిరాజని తైవాన్‌లో అమెరికా ప్రజాప్రతినిధుల చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ అడుగు పెట్టారు.
Nancy Pelosi | చైనా హెచ్చరికలను తోసిరాజని అమెరికా ప్రజాప్రతినిధుల చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ మంగళవారం తైవాన్‌లో అడుగు పెట్టారు. ఆ వెంటనే చైనాకు వ్యతిరేకంగా స్పందించారు. తైవాన్ను ఏకపక్షంగా కలిపేసుకోవాలన్న చైనా చర్యలను అమెరికా వ్యతిరేకిస్తుందన్నారు.
`తైవాన్ శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు తిరుగులేని మద్దతు కొనసాగింపులో భాగమే తమ ప్రతినిధి బృందం పర్యటన. తైవాన్ నాయకత్వంతో తమ చర్చలు, సంప్రదింపులు.. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ రీజియన్ ఏర్పాటుతోపాటు రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనాలకు మా మద్దతు కొనసాగిస్తాం. పరస్పర ప్రయోజనాలపై అభిప్రాయాలు షేర్ చేసుకుంటాం` అని నాన్సీ పెలోసీ ట్వీట్ చేశారు.
మెయిన్‌ల్యాండ్‌పై పౌర యుద్ధంలో కమ్యూనిస్టులు విజయం సాధించిన తర్వాత 1949లో తైవాన్, చైనా విడిపోయాయి. చైనా ప్రభుత్వాన్ని గుర్తించినా.. తైవాన్‌తో రక్షణ సంబంధాలను కొనసాగిస్తున్నది. కానీ, తైవాన్‌తో అమెరికా ప్రత్యక్ష సంబంధాలను చైనా వ్యతిరేకిస్తున్నది. తైవాన్‌లో నాన్సీ పెలోసీ పర్యటిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో జరిగిన ఫోన్ చర్చల్లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- china
- Nancy Pelosi
- Thaiwan
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

