వైద్య పరిశోధనల్లో తప్పుడు ప్రస్తావనలు
బయో మెడికల్ రంగంలో విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తలు సమర్పిస్తున్న ‘పరిశోధనా పత్రాల్లో’ ఉన్నదంతా నిజమేనా? అంటే కాదనే సమాధానం వస్తున్నది.
- 25 లక్షల పత్రాల్ని విశ్లేషించిన కొలంబియా వర్సిటీ
న్యూఢిల్లీ, మే 9: బయో మెడికల్ రంగంలో విద్యార్థులు, పరిశోధకులు, విద్యావేత్తలు సమర్పిస్తున్న ‘పరిశోధనా పత్రాల్లో’ ఉన్నదంతా నిజమేనా? అంటే కాదనే సమాధానం వస్తున్నది. కొన్ని తప్పుడు ప్రస్తావనలు, ఉల్లేఖనలు పేర్కొంటూ వైద్య పరిశోధనా పత్రాల్ని సమర్పిస్తున్నారన్న సంగతి తాజాగా వెలుగుచూసింది. జనవరి 2023 నుంచి ఫిబ్రవరి 2026 మధ్య ప్రచురితమైన 25 లక్షల బయో మెడికల్ పత్రాల్ని ‘కొలంబియా వర్సిటీ’కి చెందిన సైంటిస్టులు విశ్లేషించారు.
‘ఏఐ ఆధారిత వ్యవస్థ’తో వాటిని పరిశీలించారు. ఈ 25 లక్షల అకడమిక్ పేపర్స్‌లో పేర్కొన్న 9.7 కోట్ల రిఫరెన్సెన్ను శాస్త్రవేత్తలు పలు రకాలుగా పరిశీలించగా, ఇందులో 4,046 రిఫరెన్సెస్ తప్పుడు ప్రస్తావనలుగా తేలాయి.
ఉనికి లేని తప్పుడు సమాచారం, ప్రస్తావనలు 2,810 పరిశోధనా పత్రాల్లో ఉన్నాయని కనుగొన్నారు. ఉదాహరణకు..ఒక పరిశోధనా వ్యాసంలో ‘ఏబీసీ నివేదిక ప్రకారం..’ అని రాసి ఉంటే, వాస్తవానికి అలాంటి నివేదిక ఏదీ లేకపోతే..దానిని తప్పుడు ప్రస్తావన లేదా ఉల్లేఖనం అవుతుంది. తమ పరిశోధనా పత్రంలో ఒక విషయాన్ని సమర్థించుకోవడానికి అసలు ఉనికిలో లేని సమాచారాన్ని నిజమైనవిగా చూపటం చేశారన్నమాట. ఈ సమస్య వైద్యశాస్త్రంపై నమ్మకాన్ని దెబ్బ తీస్తుందని, వైద్య నిర్ణయాల్లో తప్పుడు సమాచారాన్ని ఉపయోగించడానికి దారి తీస్తుందని సైంటిస్టులు హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

