 
                                                            న్యూఢిల్లీ: మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలం నాటి చిత్రపటం(Mughal Era Painting) వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయింది. సుమారు 1575-80 మధ్య కాలంలో చిత్రకారుడు బస్వాన్ గీసిన పేయింటింగ్ దాదాపు 120 కోట్లు పలికింది. భారతీయ సాంస్కృతిక కళకు నిదర్శనమైన ఆ బొమ్మ క్రిస్టీ లండన్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయింది. కొండల మధ్య పచ్చికబయళ్లపై చీతాలు సేదతీరుతున్న పేయింటింగ్‌ను బస్వాన్ చిత్రకారుడు గీశాడు. ఆ రాకీ ల్యాండ్‌స్కేప్ పేయింటింగ్ అనూహ్యమైన రీతిలో అధిక ధరకు వేలంలో వెళ్లింది. అనుకున్నదాని కన్నా సుమారు 14 రెట్లు అధిక ధరకు ఆ చిత్రపటం వేలంలో అమ్ముడుపోయింది. దీన్ని క్రిస్టీ వేలం చరిత్రలో రికార్డుగా భావిస్తున్నారు. అక్టోబర్ 28వ తేదీన ఆ వేలం జరిగింది. బ్రిటన్‌లో 10,245,000 పౌండ్లకు ఆ పేయింటింగ్ అమ్ముడుపోయింది.
 
                            