Israel-Hamas War | గాజా నుంచి వెళ్లిపోండి, లేదా ఉగ్రవాదులుగా పరిగణిస్తాం.. నివాసితులకు ఇజ్రాయెల్ అత్యవసర హెచ్చరిక
Israel-Hamas War | గాజా నివాసితులను ఇజ్రాయెల్ ఆర్మీ మరోసారి హెచ్చరించింది. పాలస్తీనియన్లు ఉత్తర గాజా నుంచి దక్షిణం వైపునకు వెళ్లాలని మరోసారి అల్టిమేటమ్ ఇచ్చింది. లేని పక్షంలో వారిని ఉగ్రవాద సానుభూతిపరులుగా పరిగణిస్తామని పేర్కొంది. ఈ మేరకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.
టెల్ అవీవ్: ఇజ్రాయోల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం (Israel-Hamas War) మరింత తీవ్ర రూపం దాల్చుతున్నది. గాజా నివాసితులను ఇజ్రాయెల్ ఆర్మీ మరోసారి హెచ్చరించింది. పాలస్తీనియన్లు ఉత్తర గాజా నుంచి దక్షిణం వైపునకు వెళ్లాలని మరోసారి అల్టిమేటమ్ ఇచ్చింది. లేని పక్షంలో వారిని ఉగ్రవాద సానుభూతిపరులుగా పరిగణిస్తామని పేర్కొంది. ఈ మేరకు అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పేరు, లోగోతో ఉన్న కరపత్రాలను గాజా సరిహద్దు ప్రాంతాల ప్రజలకు పంపిణీ చేశారు. ‘గాజా నివాసితులకు అత్యవసర హెచ్చరిక. వాడి గాజాకు ఉత్తరాన ఉన్న మీ ప్రాణాలకు ప్రమాదం. ఉత్తర గాజాను వీడి దక్షిణ ప్రాంతానికి వెళ్లని వారిని తీవ్రవాద సంస్థ సహచరులుగా గుర్తిస్తాం’ అని ఆ కరపత్రంలో పేర్కొన్నారు. అలాగే మొబైల్ ఆడియో సందేశాలను కూడా గాజా స్ట్రిప్లోని ప్రజలకు ఇజ్రాయోల్ పంపినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
కాగా, ఇప్పటికే గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఆర్మీ ఆ ప్రాంతంలో భూ దాడులకు సన్నద్ధమవుతున్నది. దీని కోసం ఇప్పటికే గాజా సరిహద్దులో సైనిక దళాలు, ట్యాంకులు, ఆయుధాలను భారీగా మోహరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

