ఖాట్మాండు: ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పర్వతం నేపాల్‌లోని కాంచనగంగ వద్ద ఇవాళ విషాదం చోటుచేసుకున్నది. ఆ పర్వతంపై భారతీయ పర్వతారోహకుడు 52 ఏళ్ల నారాయణన్ అయ్యర్ ప్రాణాలు కోల్పోయారు. మౌంట్ కాంచనగంగపై సుమారు 8200 మీటర్ల ఎత్తు వద్ద అయ్యర్ తుది శ్వాస విడిచారు. ఆ పర్వతం ఎత్తు 8,586 మీటర్లు. ఇద్దరు గైడ్లు అతనికి సహకరించినా.. అయ్యర్ కోలుకోలేదని పర్వాతారోహక కంపెనీ ప్రతినిధి తెలిపారు. అయ్యర్ కుటుంబానికి మరణవార్త చేరవేసినట్లు చెప్పారు.
ఈసారి కాంచనగంగ అధిరోహణకు 68 మంది విదేశీ పర్వతారోహకులకు పర్మిషన్ ఇచ్చారు. ఈ ఏడాది నేపాల్‌లో మృతిచెందిన పర్వతారోహకుల్లో అయ్యర్ మూడో వ్యక్తి. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన పర్వతాల్లో 8 పర్వతాలు నేపాల్‌లోనే ఉన్నాయి.