Morocco | రబాత్, జనవరి 17: ప్రతిష్టాత్మకమైన 2030 ఫిఫా వరల్డ్ కప్‌కు స్పెయిన్, పోర్చుగల్‌తో కలిసి సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న మొరాకో దేశం ఇప్పటి నుంచే దానికి సన్నాహాలు ప్రారంభించింది. ప్రపంచ కప్‌నకు వచ్చే అతిథులు, క్రీడాభిమానులకు తమ దేశంలోని వీధి కుక్కల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు సిద్ధం చేసింది. మొరాకోలో ప్రస్తుతం 30 లక్షల వీధి శునకాలు ఉన్నట్టు అంచనా. వీటిని వధించడానికి ఆ దేశం నిర్ణయించింది.
దీనిని ప్రపంచ వ్యాప్తంగా జంతు ప్రేమికులు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా నిరసిస్తున్నారు. శునకాలను వధించడానికి మొరాకో అధికారులు అమానుష పద్ధతులు పాటిస్తున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. శునక జాతిని తగ్గించడానికి వాటికి విషం పెట్టడం, కాల్చి చంపడం వంటివి చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు చేసినా బతికి బయటపడ్డ వాటిని దారుణంగా పారలు లాంటి బరువైన వస్తువులతో కొట్టి చంపుతున్నారు. ఈ చర్యలపై జంతు హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.