వార్విక్:‘మీరు ప్రేమించే పనిని ఎంచుకోండి. జీవితంలో ఒక్క రోజు కూడా పనిచేసినట్టు అనిపించదు’ అన్న చైనా తత్వవేత్త కన్ఫ్యూషియస్ సూక్తి నిజమేనంటున్నారు శాస్త్రవేత్తలు. నచ్చిన పని పట్ల తీవ్రమైన అభిరుచి కలిగి ఉండటం ఉద్యోగ అర్హతల్లో భాగమవుతున్నదని తాజా పరిశోధన వెల్లడించింది.
పనిలో ఆనందం వెతుక్కోవడం వల్ల పని సామర్థ్యం పెరుగుతుందని తెలిపింది. సంతోషం, ఆత్మ గౌరవం వల్ల కలిగే సంతృప్తి లాంటి సానుకూల భావోద్వేగాలు మనల్ని లక్ష్యాలకు దగ్గర చేస్తాయని వెల్లడించింది. ఈ భావోద్వేగాలు ఉద్యోగి సంక్షేమాన్ని, ఉద్యోగ ప్రతిభను మెరుగు పరుస్తాయని తెలిపింది.