కోతులు ఎప్పుడూ గుంపులుగుంపులుగానే తిరుగుతుంటాయి. పిల్లకోతిని తల్లి ఎదపై హత్తుకుని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తుంటుంది. పిల్ల కోతులను విడిచి తల్లి కోతులు ఉండలేవు. అయితే, ఓ పిల్ల కోతి కొద్దిసేపు తల్లి నుంచి దూరమై మళ్లీ చెంత చేరింది. పిల్ల కోతిని చూసి తల్లితోపాటు మిగతా కోతులు దాన్ని హత్తుకున్నాయి. ఈ హృదయపూర్వకమైన వీడియో నెట్టంట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘యోధ ఫర్ ఎవర్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఓ వ్యక్తి కోతి పిల్లకు చికిత్స చేసి, దాని సహజ ఆవాసంలోకి వదిలిపెడతాడు. పిల్ల కోతి కనిపించగానే తల్లి గట్టిగా హత్తుకుంటుంది. మిగతా కోతులు వచ్చి దాన్ని హత్తుకుని, వెంట తీసుకెళ్తాయి. ఈ వీడియో నెటిజన్ల మనసు దోచుకుది. ఇప్పటి వరకూ ఈ వీడియోకు ఆరు లక్షల 55వేల వ్యూస్ వచ్చాయి. 47వేల మంది లైక్ చేశారు.
Rehabilitated wild monkey gets a huge hug from family when released..🐒🤗 pic.twitter.com/khoTJBB6Sr
— 𝕐o̴g̴ (@Yoda4ever) June 10, 2022