Mobile Internet: పాక్‌లో నాలుగో రోజూ మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్
Mobile Internet: పాక్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేసి నాలుగు రోజులు అవుతోంది. మే 9వ తేదీ నుంచి అక్కడ ఆ సేవల్ని నిలిపివేశారు. ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉన్నట్లు టెలికమ్యూనికేషన్స్ శాఖ వెల్లడించింది.
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు నేపథ్యంలో.. పాకిస్థాన్‌లో మొబైల్ ఇంటర్నెట్(Mobile Internet) సేవల్ని బంద్ చేసిన విషయం తెలిసిందే. అయితే నాలుగో రోజు కూడా ఇంకా ఆ సేవలు అందుబాటులోకి రాలేదు. మే 9వ తేదీన మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. అయితే ఇవాళ పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ ఓ ప్రకటన చేసింది. మొబైల్ ఇంటర్నెట్ సేవల పునరుద్దరణ గురించి ఇప్పటి వరకు సర్కార్‌కు ఎటువంటి ఆదేశాలు రాలేదని పీటీఏ వెల్లడించింది.
ఇమ్రాన్ అరెస్టుతో దేశవ్యాప్తంగా పీటీఐ కార్యకర్తలు భారీ హింసకు పాల్పడుతున్నారు. మిలిటరీ, ప్రభుత్వ బిల్డింగ్‌లపై దాడి చేస్తున్నారు. దీంతో లాహోర్, రావాల్పిండి, పెషావర్ లాంటి నగరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హింసను నియంత్రించే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా సైట్లను బ్లాక్ చేశారు.
మళ్లీ ప్రభుత్వ నోటీసులు వచ్చే వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేస్తామని, కానీ యూజర్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో ఉంటాయని టెలికమ్యూనికేషన్స్ శాఖ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

