ఐజ్వాల్, మే 20 : దేశంలో పూర్తి అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా మిజోరాం నిలిచింది. మిజోరాం యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంతి చౌదరి సమక్షంలో మిజోరాం ముఖ్యమంత్రి లాల్దుహోమా మంగళవారం ఈ ప్రకటన చేశారు. వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలను జయంతి చౌదరి ఈ సందర్భంగా అభినందించారు.
కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం మిజోరాం రాష్ట్రం 91.33 శాతం అక్షరాస్యతతో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. దీని ఆధారంగా, నవ భారత సాక్షరతా కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా ఇప్పుడు నూరు శాతం అక్షరాస్యతను సాధించినట్టు అధికారులు తెలిపారు.