కీవ్: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా తన మిస్సైళ్లతో దాడులు చేస్తూనే ఉంది. ఇవాళ తెల్లవారుజామున కీవ్ నగరంలో ఉన్న ఓ బహుళ అంతస్తు బిల్డింగ్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. మెరుపు వేగంతో వచ్చిన ఆ క్షిపణి.. భారీ బిల్డింగ్‌ను ధ్వంసం చేసింది. దానికి సంబంధించిన వీడియో రిలీజైంది. ఆ వీడియోలో మిస్సైల్ దూసుకెళ్తున్న తీరు కనిపించింది. మిస్సైల్ ధాటికి బిల్డింగ్‌లోని కొన్ని అంతస్తులు దెబ్బతిన్నాయి. జులియానీ విమానాశ్రయం వద్ద ఉన్న ఈ అపార్ట్‌మెంట్‌పై దాడి జరిగింది. మిస్సైల్ ధాటికి అపార్ట్మెంట్లో ఉన్న అయిదు ఫ్లోర్లు దెబ్బతిన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ దాడిలో ఎంత మంది మరణించారో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే కీవ్‌లో 35 మంది మరణించినట్లు తాజాగా ఆ నగర మేయర్ క్లిచ్కోవ్ తెలిపారు.
WATCH: Another video shows the moment a high-rise building in Kyiv is hit by a missile pic.twitter.com/jlfsyuKYdz
— BNO News (@BNONews) February 26, 2022
WATCH: Video shows the moment a high-rise building in Kyiv is hit by a missile pic.twitter.com/adrd6LSfIL
— BNO News (@BNONews) February 26, 2022