manasa varanasi | ప్రపంచ సుందరి పోటీలకు కరోనా మహమ్మారి సెగ తగిలింది. మిస్ వరల్డ్ పోటీదారులకు కొవిడ్-19 సోకడంతో పోటీలు అర్ధంతరంగా ఆగిపోయాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మిస్ వరల్డ్ -2021 ( Miss world 2021 ) గ్రాండ్ ఫినాలే గురువారం ( డిసెంబర్ 16వ తేదీన) జరగాల్సి ఉంది. కానీ పోటీలకు కొద్ది గంటల ముందు తెలంగాణ అమ్మాయి, మిస్ ఇండియా మానస వారణాసితో పాటు మరో 16 మంది పోటీదారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ప్రస్తుతం పోటీదారులంతా వరల్డ్ ఫినాలే జరగాల్సిన ప్యూర్టోరికా ( puerto rico )లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు.
కంటెస్టెంట్లలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ప్రపంచ సుందరి పోటీలను తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించాం అని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. కంటెస్టెంట్లు, సిబ్బంది, ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే 90 రోజుల్లో పోర్టారికో కొలీజియం జోస్ మిగ్వెల్ అగ్రెలాట్ ప్రపంచ సుందరి ఫినాలే పోటీలు ఎప్పుడనేది రీషెడ్యూల్ చేస్తుందని వెల్లడించారు.
ప్రపంచ సుందరి పోటీదారులు, సిబ్బంది కలిపి మొత్తం 17 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిలో మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసి కూడా ఉన్నారు. అమె 2020లో మిస్ ఇండియా వరల్డ్ కిరీటం దక్కించుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Allu Arjun: వివాదాలతో వార్తలలో నిలిచిన సమంత సాంగ్.. బన్నీ స్పందన ఏంటి?
అల్లు అర్జున్ Pushpa.. మూవీ రివ్యూ
కర్ణాటకలో ఐదుగురికి, తెలంగాణలో నలుగురికి ఒమిక్రాన్ పాజిటివ్
Omicron | ఊపిరితిత్తులపై ఒమిక్రాన్ ప్రభావం ఎంత.. శాస్త్రవేత్తల అధ్యయనంలో ఏం తేలింది?
ఆఫ్రికాలో వెలుగు చూసిన మరో భయంకరమైన వ్యాధి.. ఒమిక్రాన్ కన్నా డేంజర్.. ఇప్పటికే 89 మంది మృతి